త్వరలో వారానికి మూడు రోజులే ప‌నిదినాలు: బిల్ గేట్స్

ఏఐతో ఉద్యోగాలు పోతాయనే విష‌యంపై అనేక రోజులుగా చర్చలు జరుగుతున్నాయి

దీనిపై టెక్ నిపుణులు రకరకాలుగా అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు

ఏఐతో ఉత్పాద‌క‌త పెరుగుతుంద‌ని కొంద‌రు, జాబ్స్ కోత తప్పదని మ‌రికొంద‌రు అంటున్నారు

AI కార్పొరేట్ ప్రపంచంలో అనేక మార్పులకు దోహదం చేస్తుందని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ అన్నారు

యంత్రాలు ఫుడ్ సహా ఇతర వస్తువులను తయారు చేయడంలో అవి ప్రావీణ్యం సంపాదిస్తాయని చెప్పారు

దీంతో ఏఐ మ‌నుషుల ప‌నుల‌ను మరిత సుల‌భ‌త‌రం చేస్తుంద‌ని బిల్ గేట్స్ వెల్లడించారు

ఈ క్రమంలో రానున్న తరానికి వారానికి 3 రోజుల పనిరోజులు మాత్రమే ఉండే ఛాన్స్ ఉందన్నారు

సాంకేతికత కారణంగా క్యాన్సర్ ఉండదని, మీ పిల్లలు 100 ఏళ్ల వరకు జీవించే అవకాశం ఉందన్నారు 

JP మోర్గాన్ CEO జామీ డిమోన్ AI కారణంగా తక్కువ పని గంటలు ఉంటాయని అంచనా వేశారు

ఓ పాడ్‌కాస్ట్ ఇంట‌ర్వ్యూలో ఏఐతో చోటుచేసుకునే మార్పుల‌పై గేట్స్ త‌న అభిప్రాయాల‌ను వెల్లడించారు