ఆస్ట్రేలియా, భారత్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేలా త్వరలో మేట్స్ వీసా ప్రోగ్రామ్ ప్రారంభం కానుంది.

ఈ వీసాతో ఇండియన్స్‌కు ఆస్ట్రేలియాలో రెండేళ్ల పాటు తాత్కాలిక ప్రాతిపదికన జాబ్ చేసే అవకాశం లభిస్తుంది

ప్రముఖ భారతీయ యూనివర్సిటీల పట్టభద్రులు, యువ ప్రొఫెషనల్స్‌ ఈ వీసాకు అర్హులు

రెన్యువబుల్ ఎనర్జీ, మైనింగ్, ఇంజినీరింగ్, ఐటీ, ఏఐ నిపుణులు ఈ వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు

ఆస్ట్రేలియాలో నిపుణుల కొరతను ఈ వీసాతో కొంత మేర అధిగమించొచ్చని అక్కడి ప్రభుత్వం యోచిస్తోంది

వీసా బాలెట్ విధానంలో ఏటా 3 వేల మందికి ఈ వీసా ఇస్తారు

ఈ వీసాదారుల కుటుంబసభ్యులు కూడా ఆస్ట్రేలియాకు వచ్చి ఉపాధి పొందొచ్చు

30 ఏళ్ల లోపు వయసున్న వారే ఈ వీసాకు అర్హులు