ఎలక్ట్రానిక్స్ కంపెనీ బీపీఎల్ వ్యవస్థాపకుడు టీపీజీ నంబియార్ కన్నుమూశారు

వృద్ధాప్య సమస్యలు కారణంగా బెంగళూరులోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు

నంబియార్ తొలుత యూఎస్, యూకేలో సుదీర్ఘ కాలం పని చేశారు

భారత్‌లో నమ్మకమైన ఉత్పత్తులను అందించాలన్న ఉద్దేశంతో బీపీఎల్ కంపెనీని ప్రారంభించారు

బీపీఎల్ అంటే బ్రిటీష్ ఫిజికల్ లేబొరేటరీస్, ఎలక్ట్రానిక్స్‌లో బీపీఎల్ ఒక బ్రాండ్‌గా ముద్రపడింది

1963లో కేరళలోని పాలక్కాడ్‌లో స్థాపించబడింది

1990లో బీపీఎల్ ఎలక్ట్రానిక్స్ ఒక రేంజ్‌లోకి దూసుకెళ్లింది

టీవీ, ఫోన్ మార్కెట్ లో బీపీఎల్ భారత దేశంలో టాప్ 10లో ఒకటిగా నిలబడింది

ఆ తరువాత  LG, శాంసంగ్ లాంటి కంపెనీలతో పోటీ పడలేకపోయింది

నంబియార్ బిజెపి నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌కి మామగారు