కస్టమర్లు ఎప్పుడైనా పాలసీని రద్దు చేసుకోవచ్చా?

కావాల్సిన పత్రాలు లేవని జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు పాలసీదారుల క్లెయిమ్‌లను తిరస్కరించరాదన్న IRDAI

అవసరమైన పత్రాలను క్లెయిమ్‌ ప్రతిపాదనను పూర్తి చేస్తున్న సమయంలోనే అడగాలని వెల్లడి

క్లెయిమ్‌లను బీమా కంపెనీలు వేగంగా పరిష్కరించాలని తెలిపిన IRDAI

సమయానికి సర్వే రిపోర్టులను పొందడం బీమా సంస్థల బాధ్యత అని IRDAI వెల్లడి

పాలసీదారులకు బీమాకు సంబంధించిన పూర్తి అవగాహన కోసం కస్టమర్‌ ఇన్ఫర్మేషన్‌ షీట్‌ ఇవ్వాలని వెల్లడి

దానిలో బీమా కవరేజీ, మినహాయింపులు, వారంటీలు, క్లెయిమ్‌ పరిష్కార ప్రక్రియ అన్ని వివరంగా ఉండాలని సూచన

బీమా సంస్థకు తెలిపి రిటైల్‌ కస్టమర్లు ఎప్పుడైనా పాలసీని రద్దు చేసుకోవచ్చు

పాలసీదారుడు మోసం చేసినట్టు గుర్తిస్తే పాలసీని బీమా సంస్థ రద్దు చేయవచ్చు

పాలసీ వ్యవధి తీరకపోయినా మిగిలిన సమయంలో ప్రీమియంను రద్దు చేసుకున్న పాలసీదారునికి బీమా సంస్థ తిరిగి చెల్లించాలి

మోటర్‌ ఇన్సూరెన్స్‌ కొనుగోలుదారులకు ‘పే యాజ్‌ యూ డ్రైవ్‌’ ఆప్షన్‌ ఇవ్వాలి

అగ్ని ప్రమాద పాలసీకి వరదలు, తుఫాన్‌, భూకంపం, కొండ చరియలు విరిగిపడటం, తీవ్రవాదం వంటి యాడ్‌ కవరేజీ ఇవ్వాలి