పోస్టాఫీస్ RD పొదుపుని మధ్యలో తీసుకోవచ్చా..రూల్స్ ఎలా ఉన్నాయ్

పోస్టాఫీస్‌ రికరింగ్‌ డిపాజిట్‌ (RD)లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే దీని కాలపరిమితి ఐదేండ్లుంటుంది

క్రమం తప్పకుండా ప్రతినెలా డిపాజిట్ చేసేవారు మాత్రమే పోస్టాఫీసు ఆర్‌డీ అకౌంట్ తీసుకోవడం ఉత్తమం

అయితే ఏదైనా అత్యవసరం ఉంటే ఆర్‌డీ ఖాతా నుంచి నగుదు తీసుకోవచ్చా అనేది ఇప్పుడు తెలుసుకుందాం

RD మొదలుపెట్టిన మూడేండ్ల తర్వాత నిర్ణీత గడువు తీరకముందే ఉపసంహరించుకోవచ్చు

మీ ఆర్‌డీ ఖాతాను తెరిచిన పోస్టాఫీస్‌కే ఫామ్‌-2లో ‘ప్రీ మెచ్యూర్‌ క్లోజర్‌ ఆఫ్‌ అకౌంట్‌’గా దరఖాస్తు చేసుకోవాలి

అయితే అడ్వాన్స్‌ డిపాజిట్‌ చెల్లింపులుంటే వాటి కాలవ్యవధి ముగిసేదాకా ఆర్‌డీ ఖాతాను ముందస్తుగా మూసివేయలేం

మెచ్యూరిటీకి ఒక్కరోజు ముందుగా ఖాతాను మూసేసినా దానికి పోస్టాఫీస్‌ సేవింగ్స్‌ అకౌంట్‌ వడ్డీరేటు వర్తిస్తుంది

మెచ్యూరిటీ తర్వాత కూడా సంబంధిత తపాలా కార్యాలయానికి దరఖాస్తు చేసుకుని మరో ఐదేండ్లు పొడిగించుకోవచ్చు

నిర్ణీత కాలవ్యవధి వరకు నెలకు కనీసం రూ.10, ఆపై ఎంతైనా ఆర్‌డీల్లో పొదుపు చేసుకోవచ్చు. దీనికి ఫిక్స్‌డ్‌ వడ్డీరేటు వర్తిస్తుంది