ఆగస్టు 1 నుంచి మారేవివే..

దేశవ్యాప్తంగా ఆగస్టు 1 నుంచి పలు నిబంధనలు, ధరల్లో మార్పులు రానున్నాయి. అవేంటంటే

బీఐఎస్ నూతన నాణ్యతా ప్రమాణాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వీటి ప్రకారం.. మార్కెట్లో విక్రయించే బూట్లు, చెప్పులు ఇకపై నూతన నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. నాణ్యత పెరగుతుంది కాబట్టి.. పాదరక్షల ధరలు పెరగనున్నాయి. 

జులై నెల ప్రారంభంలో ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 71 వేల 600 ఉండేది. కేంద్ర బడ్జెట్ తరువాత 7 వేలకుపైగా ధర పతనం అయింది. వరుస తగ్గుదల తరువాత బంగారం ధరలు ఆగస్టులో మళ్లీ ఎగబాకే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఆగస్టు 1 నుంచి గూగుల్ మ్యాప్స్ నియమాల్లో మార్పులు జరగనున్నాయి. వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నంలో గూగుల్ మ్యాప్స్ దాని సేవల్లో70 శాతం వరకు ఛార్జీలను తగ్గించింది.  

హెచ్‌డీఎఫ్‌సీ ఆగస్టు 1 నుంచి అనేక మార్పులను తీసుకువస్తోంది. PayTM, CRED, MobiKwik, Cheq వంటి థర్డ్ పార్టీ పేమెంట్ యాప్‌ల ద్వారా రూ.50 వేలకుపైగా చేసిన లావాదేవిలపై ఒక శాతం రుసుము అదనంగా విధించనుంది.  

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెల మొదటి తేదీన నిర్ణయిస్తారు. జులైలో కేంద్ర ప్రభుత్వం 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను తగ్గించింది. ఆగస్టులో గ్యాస్ సిలిండర్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.