జులై 2024లో 10 ఆర్థిక మార్పులు.. తెలుసా మీకు

దేశంలో ప్రతి నెలా పలు ఆర్థిక నియమాలలో మార్పులు జరుగుతుంటాయి

ఈ క్రమంలో జులై 1, 2024 తర్వాత అమలైన, అమలు కానున్న రూల్స్ గురించి ఇక్కడ చుద్దాం

జులై 1న దేశంలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ల ధరలను రూ.30 తగ్గించారు

జులై 1 నుంచి మీ సిమ్ కార్డ్ పోయినా, చోరీ, పోర్ట్ అయినా మళ్లీ తీసుకోవాలంటే 7 రోజులు ఆగాల్సిందే

మూడేళ్లుగా ఉపయోగించని ఖాతాలను జూలై 1 నుంచి తొలగిస్తున్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ వెల్లడి

SBI, ICICI, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఛార్జీల మార్పులు జూలై 1, 2024 నుంచి అమల్లోకి వచ్చాయి

ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో పెంచిన ధరలు జులై 3 నుంచి, వోడాఫోన్ జులై 4 నుంచి అమలు చేయనుంది

సిటీ బ్యాంక్ యూజర్ల క్రెడిట్ కార్డులు జూలై 15, 2024 తర్వాత యాక్సిస్ క్రెడిట్ కార్డ్‌లుగా మార్పు

ఎక్కువ కాలం ఉపయోగించనివి, జీరో బ్యాలెన్స్ పేటీఎం ఖాతాలు జూలై 20, 2024 తర్వాత రద్దు

2024-25కు ITR ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31, 2024గా ఉంది