పీపీఎఫ్ కొత్త నిబంధనల గురించి తెలుసా

వచ్చే అక్టోబర్ 1 నుంచి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో మార్పులు జరగనున్నాయి

కొత్త పీపీఎఫ్‌ రూల్స్‌ ప్రకారం పీపీఎఫ్‌ ఖాతాలను మైనర్ల కూడా తెరుచుకోవచ్చు

కానీ మైనర్లకు 18 ఏండ్లు వచ్చేదాకా ఈ ఖాతాలు పోస్టాఫీస్‌ సేవింగ్స్‌ అకౌంట్‌ వడ్డీరేటుతో కొనసాగుతాయి

వీటిని మైనార్టీ తీరిన తర్వాత పీపీఎఫ్‌ ఖాతాగా మార్చుకోవచ్చు

దీంతోపాటు ఒకటికి మించి పీపీఎఫ్‌ ఖాతాలనూ తెరుచుకోవచ్చు

ఒకటి కంటే ఎక్కువ పీపీఎఫ్‌ ఖాతాలు ఉంటే పెట్టుబడిదారుడు ప్రాథమిక ఖాతాలో పథకం రేటు ప్రకారం వడ్డీని పొందుతారు

రెండవ ఖాతాలో బ్యాలెన్స్ ఉంటే అది ప్రాథమిక ఖాతాతో లింక్ చేయబడుతుంది

రెండు ఖాతాల మొత్తం వార్షిక పెట్టుబడి పరిమితిలోపు ఉండాలనే నిబంధన ఉంటుంది

1968 పీపీఎఫ్ కింద ప్రారంభించిన NRI PPF ఖాతాలకు ఇది వర్తిస్తుంది

ఇక్కడ ఫారమ్ H ఖాతాదారుని నివాస స్థితిని ప్రత్యేకంగా అడగదు

ఈ ఖాతాలపై వడ్డీ రేట్లు సెప్టెంబర్ 30, 2024 వరకు అందుబాటులో ఉంటాయి