టెలీ మార్కెటింగ్ కాల్ చేస్తే మీ నంబర్ బ్లాక్.. కొత్త రూల్స్ తెలుసా
నకిలీ కాల్స్, మెసేజ్‌లను కట్టడి చేసేందుకు ట్రాయ్ సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ తీసుకొస్తుంది
ఇది అమల్లోకి వచ్చిన తర్వాత అవాంఛిత కాల్స్ సమస్య చాలా వరకు తగ్గిపోతుంది
కొత్త రూల్ వల్ల బ్యాంకులు, ఈ కామర్స్ కంపెనీల నుంచి వచ్చే ఓటీపీలు ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది
ఆగస్టు 31లోపు బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు మెసేజ్ టెంప్లేట్‌లు, కంటెంట్‌ను టెలికాం ఆపరేటర్‌ల వద్ద నమోదు చేసుకోవాలి
ఈ నిబంధనలు పాటించడంలో విఫలమైతే ఆ అంశాలతో కూడిన మెసేజ్‌లు బ్లాక్ అవుతాయని ట్రాయ్ తెలిపింది
తాజా రూల్ ప్రకారం నిబంధనలకు అనుగుణంగా లేని మెసేజ్‌లను బ్లాక్ చేస్తారు
మీరు మీ వ్యక్తిగత మొబైల్ నంబర్ నుంచి టెలిమార్కెటింగ్ కాల్ చేసినా మీ నంబర్ రెండేళ్లపాటు బ్లాక్ లిస్ట్ చేస్తారు
మీకు అలాంటి సందేశాలు, కాల్స్ వస్తే ‘సంచార్ సతీ పోర్టల్’లో ఫిర్యాదు చేయవచ్చు
మీకు 10 అంకెల మొబైల్ నంబర్ నుంచి సందేశం వస్తే 1909కి కంప్లైంట్ చేయవచ్చు
Related Web Stories
ఇకపై డిపాజిట్ల ఖాతాలకు నలుగురు నామినీలు!
BSNLకు పెరుగుతున్న యూజర్లు.. 5జీ కూడా వస్తుందా
రూ.6,100 కోట్ల ఈ ఐపీఓను తీసుకున్నారా.. వివరాలివే
దేశంలో 300 బ్యాంకుల చెల్లింపు వ్యవస్థలపై ర్యాన్సమ్ వేర్ ఎటాక్!