ఐటీఆర్ దాఖలు చేసే టైంలో ఈ 10 మినహాయింపులు మరువొద్దు

మీ ఆదాయ పన్ను రిటర్ను దాఖలు చేసే క్రమంలో పన్ను ఆదా కోసం 10 మార్గాలున్నాయి

నేషనల్‌ పెన్షన్‌ స్కీంలో పెట్టుబడులకు సెక్షన్‌ 80సీ కింద రూ.1.5 లక్షలదాకా పన్ను ఆదా చేసుకోవచ్చు

సెక్షన్‌ 80డీ కింద ఆరోగ్య బీమా ప్రీమియం పాలసీ కవరేజీని బట్టి రూ.25 వేల నుంచి లక్ష వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు

సెక్షన్‌ 80ఈ కింద విద్యా రుణంలోని వడ్డీ భాగంపై పన్ను మినహాయింపు పొందవచ్చు

గృహ రుణ చెల్లింపులపై రెండు మార్గాల్లో పన్ను మినహాయింపును క్లెయిం చేసుకోవచ్చు

ఒకటి సెక్షన్‌ 80సీ కింద అసలుపై రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు

మరొకటి సెక్షన్‌ 24 కింద వడ్డీ భాగంపై రూ.2 లక్షలదాకా పన్ను ఆదా కోరవచ్చు

తొలిసారి ఇంటిని కొనుగోలుచేసేవారికి సెక్షన్‌ 80ఈఈ కింద గృహ రుణ వడ్డీపై కేంద్ర ప్రభుత్వం అదనపు పన్ను ప్రయోజనాలను కల్పిస్తుంది

సెక్షన్‌ 24 కింద వర్తించే మినహాయింపులకు అదనం. దీంతో రూ.2.5 లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది

అద్దెపై పన్ను మినహాయింపును పొందవచ్చు. సెక్షన్‌ 80జీజీ కింద ఈ అవకాశం ఉంటుంది

మీరు దివ్యాంగుల బాగోగులు చూసుకుంటున్నైట్టెతే సెక్షన్‌ 80డీడీ కింద వారి ఖర్చులపై పన్ను మినహాయింపులను కోరవచ్చు

క్యాన్సర్‌, నరాల వ్యాధులు, ఎయిడ్స్‌ వంటి రోగాల వైద్య ఖర్చులపైనా ఐటీ మినహాయింపును తీసుకోవచ్చు

సెక్షన్‌ 80డీడీబీ కింద రూ.40,000 వరకు పన్ను తగ్గింపును పొందవచ్చు. సీనియర్‌ సిటిజన్లకైతే లక్ష రూపాయలదాకా ప్రయోజనం ఉంటుంది

విరాళాలపై సెక్షన్‌ 80జీ కింద పన్ను మినహాయింపును క్లెయిం చేయవచ్చు