పట్టాలెక్కనున్న వందేభారత్ స్లీపర్ రైళ్లు.. వాటి ప్రత్యేకతలివే..

వందేభారత్ స్లీపర్ రైళ్లు డిసెంబర్‌లో పట్టాలెక్కనుంది. ఆ రైళ్లల్లో ప్రయాణికులకు కల్పిస్తున్న ప్రత్యేక సౌకర్యాలను భారతీయ రైల్వే వివరించింది.

వందే బారత్ స్లీపర్ రైళ్ల బోగీల చిత్రాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ విడుదల చేశారు. ఈ రైళ్లను బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ ‌(BEML) సంస్థ తయారు చేస్తుంది. 

వందే బారత్ స్లీపర్ రైళ్లలో మొత్తం 16 బోగీలుంటాయి. మధ్య తరగతిని దృష్టిలో పెట్టుకుని ఈ రైళ్లను భారతీయ రైల్వే తయారు చేస్తుంది. 

బీఈఎమ్ఎల్, భారతీయ రైల్వే అభివృద్ధి చేస్తున్న ఈ రైళ్లలో అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు.

బీఈఎమ్ఎల్, భారతీయ రైల్వే అభివృద్ధి చేస్తున్న ఈ రైళ్లలో అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. జీఎఫ్ఆర్‌పీ ప్యానెల్స్, సెన్సార్ ఆధారిత ఇంటర్ కమ్యూనికేషన్, దుర్వాసన లేని టాయిలెట్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. 

ప్రయాణికుల సౌకర్యం కోసం యుఎస్‌బీ ఛార్జింగ్ సదుపాయంతో కూడిన ఇంటిగ్రేటెడ్ రీడింగ్ లైట్, మాడ్యులర్ ప్యాంట్రీస్, పబ్లిక్ అనౌన్స్‌మెంట్ తదితర ఫీచర్లు ఏర్పాటు చేస్తున్నారు.

ఈ రైళ్లలో ప్రయాణికులు.. అప్పర్ బర్త్ సులువుగా ఎక్కేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికులు లగేజీ పెట్టుకునేందుకు బోగీల్లో స్థలాలను సైతం కేటాయిస్తున్నారు.

ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ బోగీలను ప్రత్యేక శైలిలో తయారు చేస్తున్నారు.

భారతీయ రైల్వే అందుబాటులోకి తీసుకు వస్తున్న ఈ రైళ్లు ఢిల్లీ - ముంబయి, ఢిల్లీ- కోల్‌కతా మార్గాల్లో తిరగనుంది.