ఈ చిట్కాలు పాటించండి.. సిబిల్ స్కోర్ పెంచుకోండి

లోన్స్ కావాలన్నా, క్రెడిట్ కార్డ్ వేగంగా మంజూరు కావాలన్నా సిబిల్ స్కోర్ తప్పనిసరి

క్రెడిట్ స్కోర్ ఎలా పెంచుకోవాలో చాలామందికి తెలియదు

ఈ టిప్స్ పాటించడం ద్వారా క్రెడిట్ స్కోర్ క్రమంగా పెంచుకోవచ్చు

మీ ఈఎంఐ చెల్లింపులు జాప్యం లేకుండా పే చేస్తే క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉంటుంది

మీ వద్ద ఒకేసారి పే చేసేందుకు డబ్బు లేకుంటే నెలవారీగా కన్‌వర్ట్ చేసుకుని చెల్లంపులు చేయోచ్చు

మీ పాత లోన్ పూర్తిగా చెల్లించినప్పటికీ అడ్మినిస్ట్రేటివ్ లోపాల కారణంగా ఇంకా యాక్టివ్‌గా ఉంటుంది

మీ పాత లోన్స్ క్లోజ్ విషయంలో సంబంధిత అధికారులతో మాట్లాడి క్లియర్ చేసుకుంటే సిబిల్ స్కోర్ పెంచుకోవచ్చు

ఇతరుల కోసం మీరు లోన్ గ్యారెంటర్‌గా మారితే ఆ వ్యక్తి ఏదైనా లోన్ చెల్లించకున్నా అది మీ సిబిల్ స్కోర్‌పై ఎఫెక్ట్ పడుతుంది

మీ అవసరాన్ని బట్టి ఒకేసారి ఒక రుణాన్ని మాత్రమే తీసుకుని సకాలంలో తిరిగి చెల్లించండి

మీ శాలరీ పరిమితికి మించి రుణాలు తీసుకోవడం కూడా మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపుతుంది

మీరు లోన్ తీసుకునేటప్పుడు దీర్ఘకాలిక రుణాన్ని ఎంచుకుంటే EMI తక్కువగా ఉండి, ఈజీగా చెల్లింపులు చేసుకోవచ్చు