మే 1 నుంచి ఈ స్మార్ట్‌ఫోన్స్, టీవీల సేల్స్ బంద్!
చైనా బ్రాండ్ వన్‌ప్లస్ సంస్థకు భారత్‌లో భారీ షాక్ తగిలింది
వన్‌ప్లస్‌కు చెందిన ట్యాబ్లెట్స్, స్మార్ట్‌ఫోన్స్, టీవీలు సహా ఇతర సేల్స్ నిలిపివేస్తున్నట్లు ప్రకటన
ఈ మేరకు వెల్లడించిన సౌత్ ఇండియా సంఘటిత విక్రయదారుల సంఘం (ORA)
ఏపీ, తెలంగాణతోపాటు పలు రాష్ట్రాలకు చెందిన మొత్తం 23 రిటైల్ స్టోర్ల యాజమాన్యాలు బుధవారం హైదరాబాద్‌లో భేటీ అయ్యాయి
అక్కడే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన
ఈ క్రమంలో సంస్థకు చెందిన మొత్తం 4,500 స్టోర్లలో మే 1 నుంచి వన్‌ప్లస్ ఉత్పత్తుల అమ్మకాలు అన్నీ నిలిచిపోనున్నాయి
ఈ ఉత్పత్తులపై మార్జిన్ తక్కువగా ఉందని, వారెంటీ పరిష్కారం కూడా వేగంగా జరగట్లేదని పేర్కొన్న స్టోర్ల యాజమాన్యం
ఈ ఉత్పత్తుల్ని విక్రయిస్తే పలు సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్న స్టోర్ల యాజమాన్యాలు
ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని రిటైల్ విక్రయ సంస్థలు వన్‌ప్లస్ ఇండియా యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాయి
కానీ ఏడాది గడుస్తున్నా కూడా కంపెనీ నుంచి ఎలాంటి స్పందనా రాలేదని యాజమాన్యాల వెల్లడి
Related Web Stories
చార్జీలు లేకుండానే ఫ్లిప్‌కార్ట్ నుంచి బస్ టికెట్ల బుకింగ్ ఆఫర్
Gold Price: బంగారం ధరలకు రెక్కలు.. ఎందుకంటే..?
ప్రపంచంలో ఆదాయపు పన్ను లేని 10 దేశాలివే
రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఆర్బీఐ నుంచి త్వరలో కొత్త యాప్