రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఆర్‌బీఐ నుంచి త్వరలో కొత్త యాప్‌

ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులను మరింత సులభతరం చేసేందుకు ఆర్‌బీఐ కీలక చర్యలు తీసుకుంటోంది

ఈ క్రమంలో రిటైల్ మదుపర్ల కోసం కొత్త మొబైల్ యాప్‌ను తెస్తామని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడి

ప్రభుత్వ బాండ్లల్లో పెట్టుబడుల కోసం 2021 నవంబర్‌లో ఆర్‌బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్‌ను ప్రారంభించింది

ప్రస్తుతం ఆర్‌బీఐ రిటైల్ డైరెక్ట్ పోర్టల్ నుంచి ప్రైమరీ, సెకండరీ మార్కెట్ ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్ చేసే వీలుంది

వేలంలో ఈ సెక్యూరిటీలను రిటైల్ మదుపర్లు క్రయవిక్రయాలను చేసుకోవచ్చు

ఈ నేపథ్యంలో రిటైల్ డైరెక్ట్ పోర్టల్‌కు చెందిన యాప్‌ను తీసుకురానున్నట్లు ప్రకటన

యాప్ రూపకల్పన జరుగుతోందని, త్వరలో అందుబాటులోకి వస్తుందని చెప్పిన శక్తికాంత దాస్

ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ల నుంచి రూ. 14.13 లక్షల కోట్ల నిధులు సేకరించాలని భావిస్తోంది

ఇందులో మొదటి అర్ధ భాగంలోనే రూ. 7.5 లక్షల కోట్ల సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది