అంబానీని అధిగమించి మళ్లీ ఆసియాలో అత్యంత సంపన్నుడిగా గౌతమ్ అదానీ
అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ మళ్లీ ఆసియాలోనే అత్యంత ధనిక వ్యక్తిగా నిలిచారు
ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీని అదానీ అధిగమించారు
ఇటీవల అదానీ కంపెనీల షేర్లు పుంజుకోవటంతో అదానీ ఈ ఘనతను సాధించారు
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ రిపోర్ట్ ప్రకారం 111 బిలియన్ డాలర్లతో అదానీ ప్రపంచ సంపన్నుల జాబితాలో 11వ స్థానంలో ఉన్నారు
అంబానీ 109 బిలియన్ డాలర్లతో 12 స్థానంలో కొనసాగుతున్నారు
అదానీ షేర్లపై అమెరికా బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ ఇటీవల సానుకూల రేటింగ్ ఇచ్చింది
దీంతో శుక్రవారం ఆయా కంపెనీల షేర్లు గరిష్ఠంగా 14 శాతం వరకు దూసుకెళ్లాయి
ఆ క్రమంలో అదానీ సంస్థకు కొత్తగా రూ.84,064 కోట్ల సంపద వచ్చి చేరింది
అదానీ గ్రూప్‌లోని 10 నమోదిత సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.17.51 లక్షల కోట్లు దాటింది
వచ్చే 10 ఏళ్లలో 90 బిలియన్ డాలర్లతో వ్యాపార విస్తరణను చేపట్టనున్నట్లు ఈ గ్రూప్ ఇప్పటికే ప్రకటించింది
Related Web Stories
భారత్‌కు లక్ష కేజీల బంగారం..మన దగ్గర ఎంత గోల్డ్ ఉంది?
ఇకపై ఫోన్ పే నుంచి కూడా ఈజీ లోన్స్
ఆరోగ్య బీమా నగదు రహిత క్లెయిమ్‌లను గంటలోపే పరిష్కరించాలి: IRDAI
త్వరలో ఆరోగ్య బీమా రంగంలోకి LIC