జూన్ 4 నుంచి గూగుల్ పే సేవలు బంద్.. కారణమిదే
స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఫోన్ పే, గూగుల్ పే విపరీతంగా వాడుతున్నారు
ఏ చిన్న పేమెంట్స్ అవసరానికైనా వీటినే ఉపయోగిస్తున్నారు
కానీ ఈ గూగుల్ పే వాడే వినియోగదారులకు వచ్చే నెల నుంచి బిగ్ షాక్ తగలనుంది
ఎందుకంటే జూన్ 4 నుంచి గూగుల్‌పేను మూసి వేయబోతున్నట్లు ఆ సంస్థనే స్వయంగా ప్రకటించింది
వచ్చే నెలలో అమెరికాలో దీని సేవలు నిలిపివేయబోతున్నట్లు గూగుల్ తెలిపింది
కంపెనీ ప్రకారం జీపే వాడే యూఎస్ వినియోగదారులందరూ గూగుల్ వాలెట్‌కి బదిలీ చేయబడుతారు
దీంతో గూగుల్ పే సేవలు బంద్ కానున్నాయి
గూగుల్ వాలెట్‌ను ప్రమోట్ చేసేందుకే కంపెనీ ఇలాంటి చర్య తీసుకుందని భావిస్తున్నారు
దాదాపు 180 దేశాల్లో Gpayని Google Wallet భర్తీ చేసిందని కంపెనీ తన బ్లాగ్‌లో పేర్కొంది
జూన్ 4 తర్వాత గూగుల్ పే యాప్ భారత్, సింగపూర్‌లో మాత్రమే పని చేయనుందంట
తర్వాత రోజుల్లో ఇండియాలో కూడా జీపే బంద్ కానుందా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు
Related Web Stories
ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు..రూల్స్ ఏం చెబుతున్నాయంటే
సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా లోన్ సాధ్యమే
కోడి గుడ్ల రేట్లు తగ్గాయోచ్.. ఏంతకు చేరాయంటే
క్యాష్ లోన్ల విషయంలో ఆర్బీఐ షాకింగ్ డెసిషన్