ఆరోగ్య బీమా నగదు రహిత క్లెయిమ్‌లను గంటలోపే పరిష్కరించాలి: IRDAI
ఆరోగ్య బీమాకు సంబంధించి ఐఆర్‌డీఏఐ కీలకమైన ఆదేశాలను విడుదల చేసింది
ఏదైనా ఆస్పత్రిలో క్యాష్‌లెస్ చికిత్స ఉందా లేదా అని ఎవరైనా అడిగితే గంటలోగా బదులివ్వాలని తెలిపింది
చికిత్సను అందించిన తర్వాత రోగిని డిశ్చార్జి చేసే విషయంలో ఆస్పత్రి నుంచి అభ్యర్థన అందిన 3 గంటల్లోగా బీమా సంస్థ బదులివ్వాలని పేర్కొంది
పాలసీదారులకు 100 శాతం క్యాష్‌లెస్ క్లెయిమ్ సెటిల్మెంట్లను పూర్తి చేసేందుకు బీమా సంస్థలు ప్రయత్నించాలని స్పష్టం చేసింది
ప్రతి ఆరోగ్య బీమా పాలసీ డాక్యుమెంట్‌తో పాటు బీమా సంస్థ తప్పనిసరిగా కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్‌ను అందించాలంది
అందులో బీమా పాలసీ రకం, కవరేజీ వివరాలు, మినహాయింపులు వంటి సమాచారాన్ని అర్థమయ్యేలా పొందుపర్చాలని తెలిపింది
క్లెయిమ్ సెటిల్‌మెంట్ల కోసం పాలసీదారు నుంచి ఎలాంటి పత్రాలు అడగొద్దని, అన్ని పత్రాలు ఆస్పత్రుల నుంచే తీసుకోవాలని బీమా సంస్థలు, టీపీఏలకు తెలిపింది
ఆరోగ్య బీమా పాలసీని ఓ కంపెనీ నుంచి మరో కంపెనీకి బదిలీ చేసే క్రమంలో నిర్ణీత గడువు నిబంధన తప్పనిసరిగా పాటించాలని ఐఆర్‌డీఏఐ వెల్లడి
అంబుడ్స్‌మన్ ఆదేశాలు ఆరోగ్య బీమా కంపెనీ 30 రోజుల్లోగా అమలు చేయకుంటే పాలసీదారుడికి రోజు రూ. 5 వేల చొప్పున చెల్లించాలని తెలిపింది
Related Web Stories
త్వరలో ఆరోగ్య బీమా రంగంలోకి LIC
తుది దశకు ముఖేష్ అంబానీ వయాకాం 18, వాల్ట్ డిస్నీ విలీన ఒప్పందం
జూన్ 4 నుంచి గూగుల్ పే సేవలు బంద్.. కారణమిదే
ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు..రూల్స్ ఏం చెబుతున్నాయంటే