ఆధార్‌లో మీ పేరు ఎన్ని సార్లు మార్చుకోవచ్చో తెలుసా

ఆధార్‌లో వివరాలు ఫ్రీగా అప్‌డేట్ చుసుకునే ఛాన్స్ మళ్లీ పొడిగించారు

ఈ క్రమంలో తాజాగా జూన్ 14, 2025 వరకు గడువు పెంచారు

మీ ఆధార్ కార్డ్‌లో మీ పేరు తప్పు ఉంటే 2 సార్లు మాత్రమే సవరించుకోవచ్చు

రెండు సార్ల తర్వాత మీరు ఆధార్‌ పేరులో ఎలాంటి మార్పులు చేయలేరు

ఆధార్ కార్డ్‌లో మీ చిరునామా మార్చాలనుకుంటే ఎటువంటి పరిమితి లేదు

వాటర్, కరెంటు బిల్, రెంటల్ అగ్రిమెంట్ ద్వారా ఆన్‌లైన్‌లో మీ చిరునామా మార్చుకోవచ్చు

కానీ మీరు మీ ఆధార్ కార్డ్‌లో లింగం లేదా పుట్టిన తేదీని మార్చాలనుకుంటే

మీ మొత్తం జీవితంలో ఒక్కసారి మాత్రమే మార్చవచ్చని గుర్తుంచుకోండి

మీ లింగం లేదా పుట్టిన తేదీని మార్చడంతో పొరపాటు చేస్తే మళ్లీ సరిదిద్దుకోలేరు

కాబట్టి లింగం లేదా పుట్టిన తేదీని మార్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి