ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు..రూల్స్ ఏం చెబుతున్నాయంటే
అనేక మంది పలు రూపాల్లో బంగారం కొనుగోలు చేస్తారు
అయితే అసలు ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం
సీబీడీటీ రూల్స్ ప్రకారం పరిమితికి లోబడి ఉన్న గోల్డ్ జోలికి ఏ ఐటీ అధికారీ వెళ్లకూడదు
ఈ క్రమంలో పెళ్లైన మహిళకు 500 గ్రాముల (అరకిలో లేదా 50 తులాలు) వరకు బంగారం ఉండొచ్చు
పెళ్లి కానీ మహిళలకు 250 గ్రాముల (పావుకిలో లేదా 25 తులాలు)కు మించి బంగారం ఇంట్లో ఉండరాదు
ఇక మగవారికి అయితే ఈ పరిమితి 100 గ్రాములే (10 తులాలు)
ఈ పుత్తడికి సంబంధించి ఎలాంటి ధ్రువపత్రాలు లేకపోయినా వాటి జోలికి పోరాదు
ఈ పరిమితులు కేవలం ఆభరణాల రూపంలో ఉన్న బంగారానికే వర్తిస్తాయి
బిస్కెట్లు, కడ్డీల రూపంలో ఉన్న బంగారానికి సంబంధించి ఈ సర్క్యులర్‌లో సీబీడీటీ ఏ సూచనలూ చేయలేదు
ఒకవేళ ఎవరికైనా వంశపారంపర్యంగా బంగారు అభరణాలు వస్తే దానికి సంబంధించి ఓ నిబంధన ఉంది
అప్పుడు అందుకు సంబంధించిన రుజువులు చూపాల్సి ఉంటుంది
సదరు సాక్ష్యాలు సరైనవేనని తేలితే ఆ నగలను ఐటీ అధికారులు సీజ్ చేయరు, లేకుంటే జప్తు చేస్తారు
Related Web Stories
సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా లోన్ సాధ్యమే
కోడి గుడ్ల రేట్లు తగ్గాయోచ్.. ఏంతకు చేరాయంటే
క్యాష్ లోన్ల విషయంలో ఆర్బీఐ షాకింగ్ డెసిషన్
రెగ్యులర్ vs డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్..వీటిలో ఏది బెటర్