యూట్యూబ్ షార్ట్స్ నుండి డబ్బు ఎలా సంపాదించవచ్చు తెలుసా?
యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలామంది యూట్యూబ్ షార్ట్స్ చూడటానికే ఇష్టపడతారు.
యూట్యూబ్ షార్ట్స్ కు మిలియన్ల కొద్దీ వీక్షణలు ఉండటం కూడా గమనించి ఉంటారు.
కేవలం కొన్ని సెకెన్ల నిడివిలో ఉంటే యూట్యూబ్ షార్ట్స్ తో డబ్బు సంపాదించవచ్చు.
యూట్యూబ్ షార్ట్స్ ద్వారా డబ్బు సంపాదించాలంటే సబ్స్క్రైబర్స్, వ్యూస్ కీలకం.
యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ ద్వారా డబ్బు సంపాదించాలంటే యూట్యూబ్ ఛానెల్ లో కనీసం వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి.
యూట్యూబ్ షార్ట్స్ కు గత 90 రోజుల్లో 10మిలియన్ వ్యూస్ వచ్చి ఉండాలి. అంటే 90 రోజుల్లో కోటి వ్యూస్ వచ్చి ఉండాలి.
సబ్స్క్రైబర్స్, వ్యూస్ వచ్చినట్టైతే అప్పుడు యూట్యూబ్ పార్ట్నర్ అవుతారు.
యూట్యూబ్ పార్ట్నర్ అయిన తరువాత షార్ట్స్ ను క్రమం తప్పకుండా అప్లోడ్ చెయ్యాల్సి ఉంటుంది. వీక్షకులకు నచ్చే షార్ట్స్ ను అప్లోడ్ చేస్తే వ్యూస్ బాగా వస్తాయి.
ట్రెండింగ్ ను అనుసరించడం, అభిరుచిని విభిన్నంగా ప్రదర్శించడం వల్ల కూడా వ్యూస్ రాబట్టవచ్చు.
ఇవన్నీ పర్పెక్ట్ గా చేయగలిగితే యూట్యూబ్ షార్ట్స్ నుండి డబ్బులు సంపాదించవచ్చు.