భారత్ ఏఐ లో సత్తా చాటుతుందని ఎన్విడియా వ్యవస్థాపకుడు జెన్సన్‌ హువాంగ్‌ అన్నారు

భవిష్యత్‌లో ఏఐ సొల్యూషన్స్‌ను ప్రపంచానికి ఎగుమతి చేయబోతోందని చెప్పారు

ముంబయిలో నిర్వహించిన ఎన్విడియా ఏఐ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు

భారత్‌లో తమ ఎకోసిస్టమ్‌ విస్తరణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు

భవిష్యత్‌లో ప్రతివ్యక్తికీ ఏఐ కో-పైలట్లు ఉండబోతున్నాయని చెప్పారు

ఏఐ పూర్తిగా ఉద్యోగాలు తుడిచిపెట్టబోదని, దాని స్వరూపాన్ని మారుస్తుందని పేర్కొన్నారు

భారత్‌లో ఏఐ మౌలిక సదుపాయాల కల్పనకు రిలయన్స్‌తో

ఎన్విడియా భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నట్లు హువాంగ్‌ ప్రకటించారు

ఈ భాగస్వామ్యం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు ముకేశ్‌ అంబానీ పేర్కొన్నారు

జెన్సన్ హువాంగ్‌ను బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ కూడా కలిశారు