10గ్రాముల బంగారం ధర లక్ష దాటుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..!
బంగారం అంటే భారతీయులకు చాలా ఇష్టం. శుభకార్యాలు, పెళ్లిళ్లు, పండుగలకు బంగారం కొంటారు.
దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 76,900 ఉంది.
10గ్రాముల బంగారం ధర లక్ష దాటబోతోందనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
గత వారంలో బంగారం ధర రూ.1547 పెరిగింది.
ఇక ఈ ఏడాది అయితే రూ. 12,288 పెరిగింది.
ఈ ఏడాది జనవరిలో 24క్యారెట్ల బంగారం ధర రూ.63వేలు కాగా ఇప్పుడు రూ. 76,900కు చేరింది.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును తగ్గించడం వల్ల డాలర్ విలువ తగ్గింది. ఇదే బంగారం ధర పెరగడానికి కారణమట.
కొన్ని సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేశాయి. వివిధ దేశాలలో యుద్ద పరిస్థితులు కూడా బంగారం ధర పెరగడానికి కారణాలు.
నిపుణుల అభిప్రాయాల ప్రకారం 2024 చివరకు వచ్చే సరికి బంగారం ధర రూ.1లక్షకు చేరవచ్చని అంటున్నారు.
యూఎస్ డాలర్ విలువ పెరుగుదల, భౌగోళిక రాజకీయ పరిస్థితులలో మార్పు లేకపోతే బంగారం ధరలు ఖచ్చితంగా పెరుగుతాయట.
Related Web Stories
నేడు బంగారం ధరలు ఎలా ఉన్నారంటే.. ?
2024 ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీలు ఇవే..
త్వరలో SBI నుంచి SIPతోపాటు రికరింగ్ డిపాజిట్ స్కీం
స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేముందు తప్పక చూడాల్సిన మూవీస్