వచ్చే నెల నుంచి ఈ జాబ్స్ పుంజుకుంటాయ్

గత కొన్నేళ్లుగా స్తబ్దుగా కొనసాగుతున్న టెక్ ఇండస్ట్రీ పుంజుకోనుంది

నియామకాలకు సంబంధించి దేశీయ ఐటీ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి

ప్రముఖ స్టాఫింగ్ సొల్యూషన్స్ సంస్థ క్వెస్ కార్ప్ సీఈఓ గురుప్రసాద్ ఈ మేరకు తెలిపారు

అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఐటీ కంపెనీల్లో నియామకాలు పుంజుకుంటాయన్నారు

అమెరికా వడ్డీ రేట్ల తగ్గింపు వల్ల బ్యాంకులు, వాణిజ్య సంస్థలు ఐటీ వ్యయాలు పెంచుతాయన్నారు

ఈ క్రమంలో ఐటీ సేవలకు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని వెల్లడి

దీంతో 2024-25లో 30 వేల మందికిపైగా ఐటీ ఫ్రెషర్లను ఎంపిక చేసే ఛాన్స్ ఉందన్నారు

ఫ్రెషర్లతో పాటు పని అనుభవం ఉన్న ఐటీ నిపుణులు కూడా టెక్ కంపెనీలకు అవసరమని వెల్లడి

పండగల సీజన్‌లో జనరల్ స్టాఫింగ్ విభాగం గణనీయంగా పుంజుకుంటుందని అంచనా

జీటీఎస్, ఆహార వ్యాపారం అక్టోబర్- డిసెంబర్, జనవరి- మార్చిలో రాణిస్తాయన్నారు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయాలు రూ.110 కోట్లు కేటాయించినట్లు వెల్లడి