భారత సంతతి బిలియనీర్ ఫ్యామిలీలో నలుగురికి జైలు శిక్ష

భారత సంతతికి చెందిన హిందూజా ఫ్యామిలీ బ్రిటన్‌లోనే అత్యంత సంపన్నులుగా ఉన్నారు

అలాంటి ఫ్యామిలీలో నలుగురికి స్విట్జర్లాండ్‌లోని ఓ కోర్టు నాలుగన్నరేళ్లు జైలుశిక్ష విధించింది

స్విట్జర్లాండ్‌‌లోని జెనీవా నగరంలో ప్రకాశ్‌ హిందూజా కుటుంబానికి ఒక విల్లా ఉంది

ఆ విల్లాలో పనిచేసే సిబ్బంది కంటే పెంపుడు కుక్కలకే ఎక్కువ ఖర్చు చేస్తున్నారనే అభియోగాలు నిరూపితమయ్యాయి

అయితే అక్కడ పనిచేసే సిబ్బంది ఎక్కువగా భారతీయులే ఉండటం విశేషం

దీంతో హిందూజా కుటుంబంలోని నలుగురికి కోర్టు జైలు శిక్షను ఖరారు చేసింది

ఆ క్రమంలో ప్రకాశ్‌ హిందూజా, ఆయన సతీమణి కమల్‌కు చెరో నాలుగున్నరేళ్ల జైలుశిక్ష పడింది

ప్రకాశ్‌ హిందూజా కుమారుడు అజయ్‌, కోడలు నమ్రతకు కూడా నాలుగేళ్ల శిక్ష విధించారు

ప్రకాశ్‌ హిందూజా కుటుంబ వ్యాపార వ్యవహారాలు చూసుకునే నజీబ్‌కి కోర్టు 18 నెలల శిక్ష విధించింది

ఈ కేసులో మానవ అక్రమ రవాణాకు సంబంధించిన ఆరోపణలను మాత్రం కోర్టు తోసిపుచ్చింది