2024లో భారత్ వృద్ధి రేటుపై మూడీస్ కీలక ప్రకటన
భారతదేశ జీడీపీ 2024లో 7.2 శాతానికి పెరుగుతుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ వెల్లడి
గతంలో 6.8 శాతంగా అంచనా వేయగా, తాజాగా దానిని సవరించి వృద్ధి అంచనాలను పెంచింది
ఇక 2025లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతానికి చేరుకుంటుందని ప్రకటన
అంతకుముందు మూడీస్ వృద్ధి అంచనాను 6.4 శాతంగా అంచనా వేసింది
సవరించిన అంచనాలు ప్రైవేట్ వినియోగంలో పెరుగుదలను సూచిస్తాయని వెల్లడి
ప్రపంచ వృద్ధి స్థిరీకరించబడటంతో ఈ ప్రభావం భారత్‌పై ఉంటుందని మూడీస్ 2024, 2025కి భారత వృద్ధి అంచనాలను 7.2, 6.6 శాతానికి పెంచింది
2024 మొదటి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ సంవత్సరానికి 7.8 శాతంగా నమోదైంది
కఠినమైన ద్రవ్య విధానం, ఆర్థిక ఏకీకరణపై పురోగతి కారణంగా ఈ వృద్ధి సాధ్యమైంది
పారిశ్రామిక, సేవల రంగాలు రెండూ బలమైన పనితీరును కనబరిచాయి
ఆర్‌బీఐ లక్ష్యం మేరకు ద్రవ్యోల్బణం తగ్గడంతో గృహ వినియోగం పెరగడానికి సిద్ధంగా ఉందని మూడీస్ పేర్కొంది
Related Web Stories
ఆన్లైన్ పాస్ పోర్ట్ సేవలు కొద్ది రోజులు బంద్
టెలీ మార్కెటింగ్ కాల్ చేస్తే మీ నంబర్ బ్లాక్.. కొత్త రూల్స్ తెలుసా
ఇకపై డిపాజిట్ల ఖాతాలకు నలుగురు నామినీలు!
BSNLకు పెరుగుతున్న యూజర్లు.. 5జీ కూడా వస్తుందా