డబ్బుదేముందని చాలా మంది తక్కువ చేసి మాట్లాడతారు. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో దానిదే కీ రోల్.

డబ్బు కూడబెట్టేందుకు చాలా మంది నానా కష్టాలూ పడుతుంటారు. అయినా పొదుపు చేయలేరు.

డబ్బు విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరి.

డబ్బు విషయంలో ముందుగా భాగస్వామితో కూర్చుని మీ డ్రీమ్స్ గురించి మాట్లాడండి. 

ఇల్లు, భూమి, కారు, జ్యువెలరీ ఇలాంటి విషయాల గురించి భాగస్వామితో చర్చించండి.

వాటిని నెరవేర్చుకునేందుకు తన సహకారం కావాలని చెప్పి ఎలా ఆదా చేయాలో ప్లాన్ చేయండి.

ఆదాయం, ఖర్చుల గురించి నెలవారీ బడ్జెట్ వేసుకోండి. దేనికెంత ఖర్చు చేయాలో ప్లాన్ చేసుకోండి.

ఇంటి అద్దె, కరెంట్, ఈఎమ్ఐ వంటి ఖర్చులు పోను మిగిలిన డబ్బుని సేవ్ చేసేలా ప్రణాళిక వేయండి.

అయితే పొదుపు చేయాలని ఉద్దేశంతో డబ్బు మొత్తం సేవ్ చేయొద్దు. అలా చేస్తే గొడవలు ఖాయం.

మీరు సంతోషంగా గడిపేందుకు ప్రతి నెలా కొంత నగదు పక్కన పెట్టండి.

భవిష్యత్‌లో ఏ సమస్య వస్తుందో తెలియదు. కాబట్టి అత్యవసర నిధి కోసం కొంత దాయండి.

దీన్ని ఏ కారణం చేత ఆపొద్దు.. మధ్యలో ఏ సమస్య వచ్చినా ఈ డబ్బే మీకు ధైర్యాన్ని ఇస్తుంది.

హ్యాపీ లైఫ్ కోసం ఇద్దరూ కలిసి కష్టపడండి, ఒక్కరే బతుకు బండి లాగొద్దు. బాధ్యతలు పంచుకోండి.