EMIలు బౌన్స్ అవుతున్నాయా.. నో టెన్షన్ ఇలా చేయండి!
ఇటివల అనేక మంది ఇల్లు, కారు సహా ఏది కొన్నా కూడా EMIల రూపంలో చెల్లింపులు చేస్తున్నారు
తీసుకున్న లోన్ EMI నిర్ణీత తేదీన చెల్లించకుంటే మీ EMI బౌన్స్ అవుతుంది, జరిమానా విధిస్తారు
అయితే దీని గురించి మీరు భయపడాల్సిన పనిలేదు. వెంటనే మీరు సంబంధిత బ్యాంకు అధికారితో మాట్లాడండి
దీన్ని ఉద్దేశపూర్వకంగా చేయలేదని, వచ్చే సారి గడవు తేదీలోగా చెల్లిస్తానని చెప్పి, పెనాల్టీని తొలగించాలని విజ్ఞప్తి చేయండి
ఇలా చేయడం ద్వారా మీ లోన్ EMI బౌన్స్ అయినా, జరిమానా విధించినా కూడా మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు
ఒకవేళ మీ ఈఎంఐ తేదీ నాటికి మీకు శాలరీ రాకుంటే ఆ తేదీని మార్చాలని ఆయా సంస్థలను కోరవచ్చు
మీ EMI మూడు నెలల పాటు బౌన్స్ అయితే బ్యాంక్ మేనేజర్ CIBIL స్కోర్ ప్రతికూల నివేదికను పంపిస్తారు
ఒక వేళ మీరు ఛార్జీలు చెల్లించాలని ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే వారిపై అంబుడ్స్ మన్ లేదా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు
వీరి వేధింపులకు బయపడి ఆత్మహత్యలు చేసుకోవద్దు. కుటుంబం, పిల్లల పరిస్థితి గురించి కూడా ఆలోచించండి
Related Web Stories
జులై 2024లో 10 ఆర్థిక మార్పులు.. తెలుసా మీకు
పెళ్లైన మహిళలకు ఈ కంపెనీలో నో జాబ్స్..!
పోస్టాఫీస్ RD పొదుపుని మధ్యలో తీసుకోవచ్చా.. రూల్స్ ఎలా ఉన్నాయ్
భారత సంతతి బిలియనీర్ ఫ్యామిలీలో నలుగురికి జైలు శిక్ష