మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసేందుకు చిన్నాపెద్ద ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తుంటారు.

పాస్ట్ రిటర్న్స్ కూడా లాంగ్ రన్‌లో మంచి లాభాలు వచ్చాయనే నిపుణులు చెబుతుంటారు.

చిన్న ఇన్వెస్టర్లకు మరింత ఆసక్తి కలిగించేందుకు కంపెనీలు సిప్ మొత్తాన్ని తగ్గిస్తూ వస్తున్నాయి.

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇటీవల సిప్ మొత్తం తగ్గించడంపై ప్రతిపాదన చేసింది.

ప్రస్తుతం సిప్ నెలకు కనీసం రూ.500గా ఉండగా దీన్ని రూ.250చేయాలని సెబీ భావిస్తోంది.

అయితే ఇదే క్రమంలో తాజాగా మిరే అసెట్ మ్యూచువల్ ఫండ్ అనే కంపెనీ ముందుకొచ్చింది.

2024, అక్టోబర్ 1నుంచి రూ. 99 సిప్ విధానం అందుబాటులోకి తెస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.

ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ కూడా రూ.100కనీస పెట్టుబడితో సిప్ చేసేందుకు అవకాశం కల్పించింది.

ఈ విధానం దిగువ, మధ్య తరగతి సహా చిన్న వ్యాపారులు, యువతకు లబ్ధి చేకూరేలా ఉంది.

సెబీ కూడా త్వరలోనే రూ.250 సిప్ దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.