ప్రముఖ కంపెనీ ఒక్కో షేరుపై రూ. 194 డివిడెండ్ ప్రకటన

రూ.194 డివిడెండ్ ప్రకటించిన MRF కంపెనీ

దేశంలో అత్యంత విలువైన స్టాక్‌గా ప్రస్తుతం MRF కొనసాగుతుంది

ఈ కంపెనీ ఇటివల FY24లో ఒక్కో షేరుకు రూ. 194 తుది డివిడెండ్‍‌ను ప్రకటించింది

దీంతో మొత్తం వార్షిక డివిడెండ్ ఒక్కో షేరుకు రూ.200కి చేరుకుంది

కంపెనీ తాజాగా ప్రకటించిన డివిడెండ్‌తోపాటు ఇప్పటికే మధ్యంతర డివిడెండ్‌ను రెండుసార్లు రూ.3 చొప్పున అందించింది

2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఎంఆర్‌ఎఫ్‌ నికరలాభం రూ.2081 కోట్లుగా నమోదైంది

2022-23 నికరలాభం రూ.769 కోట్లు అని కంపెనీ తెలిపింది

కార్యకలాపాల ఆదాయం కూడా రూ.23,008 కోట్ల నుంచి రూ.25,169 కోట్లకు వృద్ధి చెందినట్లు కంపెనీ చెప్పింది