పెళ్లైన మహిళలకు ఈ కంపెనీలో నో జాబ్స్..!
యాపిల్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ఫాక్స్‌కాన్ వివాదంలో చిక్కుకుంది
ఈ ప్లాంటులో వివాహిత మహిళలకు జాబ్స్ నిరాకరించిన అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది
ఇటీవల వివాహిత మహిళల దరఖాస్తులను చెన్నై ప్లాంట్ తిరస్కరించినట్లు తెలిసింది
చెన్నై ఫాక్స్‌కాన్ ప్లాంటులో ఇటీవల ఇద్దరు పెళ్లైన మహిళలు వివక్షకు గురైనట్లు చెప్పారు
జాబ్స్ కోసం కంపెనీకి వెళ్లగా అక్కడి సెక్యూరిటీ పెళ్లైన మహిళలు వెళ్లిపోవాలని సూచించినట్లు వారు తెలిపారు
ఈ అంశంపై ఫాక్స్‌కాన్ ఇండియా మాజీ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ ధృవీకరించడం చర్చనీయాంశంగా మారింది
పెళ్లి కానీ మహిళల కంటే పెళ్లైన వారికి ఎక్కువ బాధ్యతలు ఉంటాయని కంపెనీ విశ్వసిస్తోంది
అందుకే కంపెనీ వారికి ఉద్యోగాలివ్వడం లేదని కంపెనీ వర్గాలు అంటున్నాయి
ఈ విషయం తెలిసిన కేంద్ర కార్మిక శాఖ వివరణాత్మక నివేదిక ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరింది
ఇది తెలిసిన నెటిజన్లు ప్రముఖ కంపెనీలో పెళ్లైన మహిళలపై వివక్ష చూపించడం సరికాదని అంటున్నారు
Related Web Stories
పోస్టాఫీస్ RD పొదుపుని మధ్యలో తీసుకోవచ్చా.. రూల్స్ ఎలా ఉన్నాయ్
భారత సంతతి బిలియనీర్ ఫ్యామిలీలో నలుగురికి జైలు శిక్ష
మహిళలు లోన్ తీసుకుని మరణించినా రూ.10 లక్షల సాయం!
సామ్సంగ్, పేటీఎం మధ్య ఒప్పందం