గ్రామాలలో ఈ స్థలం కొనొద్దా.. కొంటే ఏమవుతుంది?

విదేశాల్లో స్థిరపడిన భారతీయులు ఇక్కడ స్థిర ఆస్తులు కొనడం ప్రస్తుతం సర్వసాధారణమైపోయింది

అయితే ఎన్నారైలు భారతదేశంలో వ్యవసాయ భూములు, ప్లాంటేషన్‌ ల్యాండ్‌, ఫాంహౌస్‌లు కొనాలా? వద్దా? అని చాలా సందేహాలున్నాయి

ఈ విషయంలో మాత్రం అనేక మంది వ్యక్తులు సలహాలు తీసుకోకుండా ఆర్థిక కష్టాల్లో చిక్కుకుంటారు

ఫెమా రూల్స్ ప్రకారం విదేశాల్లో ఉన్నవారు భారతదేశంలో వ్యవసాయ భూములు, ప్లాంటేషన్‌ ల్యాండ్‌, ఫాంహౌస్‌లు కొనొద్దు

ఎన్నారైలు కొనుకోవచ్చని, ఓసీఐ మాత్రమే కొనకూడదనీ వాదిస్తారని ఈ వాదనలో నిజం లేదు

అలా కొన్న పక్షంలో ప్రభుత్వం చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంది. ట్రాన్‌జాక్షన్స్‌ మీద పెనాల్టీ మూడు రెట్లు వేస్తారు

ఎన్నారైలు భారతదేశంలో రియల్‌ ఎస్టేట్‌పై దృష్టి సారించినప్పుడు కమర్షియల్‌ ప్రాపర్టీస్‌, రెసిడెన్షియల్‌ ప్రాపర్టీస్‌ కొంటారు

ఇంకా చెప్పాలంటే విల్లాలు ఎక్కువగా కొంటారు. కానీ స్థలం తప్ప మరేదైనా కొనుక్కోవడం ఉత్తమం

ప్రాపర్టీ కొనేందుకు ముందు ఇండియాకు వచ్చీ రాగానే రియల్‌ ఎస్టేట్‌ ప్రాపర్టీ విషయంలో ముందు సీఏను సంప్రదించాలి