రూ.6,100 కోట్ల ఈ ఐపీఓను తీసుకున్నారా.. వివరాలివే

దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ ఆగస్టు 2న ప్రారంభమైంది

దీని ఒక్కో షేరు ధర రూ.72-76 నిర్ణయించగా, ఈ ఐపీఓ ఆగస్టు 6 వరకు మాత్రమే ఉంటుంది

కొనుగోలుదారులు లాట్ కోసం 195 షేర్లను రూ.14,820తో కొనుగోలు చేయాల్సి ఉంటుంది

కంపెనీ ఉద్యోగులు కూడా ఈ ఐపీఓలో పాల్గొనవచ్చు. వారికి ఒక్కో షేరుపై రూ.7 రాయితీ ఉంది

ఐపీఓ కేటాయింపు ఆగస్టు 7న ఉంటుంది. షేర్ల కేటాయింపులు జరగని వారికి ఆగస్టు 8న రీఫండ్ జరుగుతుంది

స్టాక్ మార్కెట్లో ఈ కంపెనీ షేర్ల లిస్టింగ్ ఆగస్టు 9న జరగనుంది

ఈ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా ఓలా రూ.6,100 కోట్లు సమీకరించనుంది

వీటిలో రూ.5,500 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ఇష్యూ ద్వారా జారీ చేశారు

పెట్టుబడిదారులు, ప్రమోటర్లు ఆఫర్ ఫర్ సేల్ క్రింద 8.49 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయిస్తున్నారు

75 శాతం క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ కొనుగోలుదారులకు, 10 శాతం రిటైల్ ఇన్వెస్టర్ల కోసం రిజర్వ్ చేశారు