కాఫీ కంటే తక్కువ రేటుకే బీమా పాలసీ

డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్ పే స్పెషల్ బీమా పాలసీని ప్రకటించింది

అదే ఫైర్‌ క్రాకర్ ఇన్సూరెన్స్ ప్లాన్. దీని ధర రూ.9 మాత్రమే

ఈ ప్లాన్ ధర కాఫీ కంటే తక్కువగా ఉండటం విశేషం

ఈ పాలసీల విక్రయం అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3, 2024 వరకు ఉంటుంది

దీనిని తీసుకోవడం ద్వారా రూ. 25 వేల కవరేజీని పొందవచ్చు

దీని ద్వారా పాలసీదారులు పటాకుల కారణంగా గాయపడి ఆసుపత్రిలో చేరడం, ప్రమాదవశాత్తు మరణం నుంచి భద్రత లభిస్తుంది

ఈ ప్లాన్ పాలసీదారు జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలతో సహా గరిష్టంగా నలుగురు కుటుంబ సభ్యులు తీసుకోవచ్చు

ఈ బీమా పాలసీ చెల్లుబాటు దీపావళి సమయంలో 10 రోజులు మాత్రమే ఉంటుంది

బీమా కవరేజీని అందించడానికి బజాజ్ అలయన్జ్ జనరల్ ఇన్సూరెన్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఫోన్ పే వెల్లడి

ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరిన ఫోన్ పే సంస్థ