త్వరలోనే ఈ ప్రభుత్వ బ్యాంక్ ప్రైవేటీకరణ

మరికొన్ని రోజుల్లోనే ప్రభుత్వ రంగ సంస్థ ఐడీబీఐ బ్యాంక్‌ ప్రైవేటీకరణ కానుంది

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి కావాల్సిన భద్రతాపరమైన అనుమతులు ఇప్పటికే వచ్చేశాయి

ఈ మేరకు గురువారం అందుకు సంబంధించిన విషయాలను ఓ అధికారి తెలిపారు

ఈ క్రమంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి కూడా త్వరలోనే అనుమతి రానుంది

ప్రభుత్వం ఎల్ఐసీతో కలిసి దాదాపు 61 శాతం వాటాను విక్రయించనుంది

కానీ ఈ బ్యాంక్‌లో కేంద్రానికి ఎల్‌ఐసీకి కలిపి మొత్తం 94.72% వాటా ఉంది

ఆర్‌బీఐ నుంచి అవసరమైన అనుమతులు త్వరలో వస్తాయని అధికారులు చెబుతున్నారు

ఈ క్రమంలో నలుగురు బిడ్డర్లు బ్యాంక్‌లో మెజారిటీ వాటా కోసం ప్రారంభ బిడ్‌లను సమర్పించారు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్, అసెట్ మానిటైజేషన్ ద్వారా రూ.50 వేల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం బడ్జెట్‌లో నిర్ణయించింది