దేశంలో 300 బ్యాంకుల చెల్లింపు వ్యవస్థలపై ర్యాన్సమ్ వేర్ ఎటాక్!
భారత్‌లో పలు బ్యాంకులకు సాంకేతిక పరిజ్ఙానాన్ని అందించే టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్‌పై ర్యాన్సమ్‌వేర్ ఎటాక్
దీంతో దేశంలో దాదాపు 300 స్థానిక బ్యాంకుల చెల్లింపు వ్యవస్థలు తాత్కాలికంగా నిలిచిపోయాయి
ఈ విషయాన్ని వార్తా ఏజెన్సీ సంస్థ రాయిటర్స్ తాజాగా ధ్రువీకరించింది
ఈ క్రమంలో పలు రకాల చిన్న తరహా బ్యాంకులకు సంబంధించిన టెక్నాలజీ సిస్టంలు అందించే సీ ఎడ్జ్ టెక్నాలజీస్‌పై ఈ దాడి జరిగింది
అయితే సీ ఎడ్జ్ టెక్నాలజీ, RBIలు మాత్రం ఈ విషయాన్ని ఇంకా వెల్లడించలేదు
చెల్లింపు వ్యవస్థలను పర్యవేక్షించే NPCI ర్యాన్సమ్ వేర్ దాడి ఘటన తమ దృష్టికి వచ్చినట్టు తెలిపింది
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు సేవలు అందించే సీ ఎడ్జ్ టెక్నాలజీస్‌పై ఈ దాడి జరిగిందన్నారు
ఈ సందర్బంగా రిటైల్ పేమెంట్స్‌తో సీ ఎడ్జ్ సాంకేతికను తాత్కాలికంగా వేరుచేసినట్లు వెల్లడి
దీంతో పాటు ఈ సంస్థ సేవలు అందిస్తున్న పలు బ్యాంకుల కస్టమర్లు ప్రస్తుత సమయంలో సేవలు పొందలేరని ప్రకటన
ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించి బ్యాంకుల ఖాతాలు త్వరగా పనిచేస్తాయని పేర్కొంది
Related Web Stories
ఉప్పులు అనేక రకాలు.. వీటి లాభాలు తెలుసా
ఆగస్టు 1 నుంచి మారేవివే
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లివే..
త్వరలోనే ఈ ప్రభుత్వ బ్యాంక్ ప్రైవేటీకరణ