డిజిటల్ లావాదేవీల ధృవీకరణ కోసం చాలకాలంగా వినియోగంలో ఉన్న ఓటీపీ మరుగున పడబోతున్నట్లు తెలుస్తోంది.
ఓటీపీ స్థానంలో మరో సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ కసరత్తు చేస్తోంది.
డిజిటల్ చెల్లింపుల ధృవీకరణకు ఓటీపీలు ఉపయోగపడుతున్నా.. మోసగాళ్లకు అవకాశంగా మారుతున్నాయి.
ఈ మోసాలను అరికట్టేందుకు అథెంటికేషన్ యాప్‌లు, బయోమెట్రిక్ సెన్సార్‌లను అందుబాటులోకి తేనున్నారు.
ఓటీపీ సిస్టమ్ నుంచి అథెంటికేషన్ యాప్‌లకు మారే విషయంలో సవాళ్లు ఎదురయ్యే అవకాశమూ ఉంది.
యాప్స్ సపోర్ట్ లేని ఫీచర్ ఫోన్లు వినియోగిస్తున్నవారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
వినియోగదారులు అందరికీ సౌకర్యవంతంగా ఉండేలా ఆర్బీఐ ఎలాంటి పరిష్కారాలు చూపిస్తుందో వేచి చూడాలి.