భారత్‌కు లక్ష కేజీల బంగారం..మన దగ్గర ఎంత గోల్డ్ ఉంది?

ఇంగ్లాండ్‌ నుంచి 100 మెట్రిక్‌ టన్నుల బంగారాన్ని భారత్‌కు తీసుకొచ్చింది RBI

గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఇంత విలువైన పుత్తడిని ఒకే ఏడాది తీసుకురావడం విశేషం

1991 తర్వాత ఇంత స్థాయిలో బంగారాన్ని తరలించడం కూడా ఇదే తొలిసారి

ఆర్థిక సంక్షోభం కారణంగా గతంలో భారత్‌ పెద్ద ఎత్తున బంగారాన్ని విదేశాల్లో తనఖా పెట్టింది

ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటంతో విదేశాల్లో తనఖా పెట్టిన గోల్డ్‌ని RBI తిరిగి తీసుకోస్తుంది

ఈ క్రమంలోనే 2023-24లో పెద్ద మొత్తంలో పుత్తడిని తిరిగి తీసుకొచ్చారు

అంతేకాదు గతేడాది కొత్తగా 27.46 మెట్రిక్‌ టన్నుల బంగారాన్ని కూడా కొనుగోలు చేశారు

దీంతో ప్రస్తుతం సెంట్రల్‌ బ్యాంక్‌ వద్ద 822 మెట్రిక్‌ టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి

వీటిలో సగానికి పైగా 413.79 టన్నుల పుత్తడిని విదేశాల్లో నిల్వ ఉంచారు

గడిచిన ఆర్థిక సంవత్సరానికి రిజర్వు బ్యాంక్‌ విడుదల చేసిన ఇటివల నివేదికలో ఈ వివరాలు వెల్లడి

బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌లో అనేక దేశాలకు చెందిన కేంద్ర బ్యాంకులు తమ బంగారాన్ని నిల్వ చేస్తుంటాయి

ఈ క్రమంలోనే భారత్‌ సైతం అక్కడ పెద్ద మొత్తంలో పసిడిని నిల్వ ఉంచింది