బ్యాచిలర్స్ కోసం పొదుపు చిట్కాలు

పెళ్లికి ముందే యవతీ యువకులు ఆర్థిక అంశాల పట్ల అవగాహన కల్గి ఉండాలి

అనవసర ఖర్చులకు పోకుండా ప్రతి నెల సేవ్ చేయడంపై దృష్టి మళ్లించాలి

ఇలా చేయడం ద్వారా పెళ్లి తర్వాత కూడా ఆర్థిక విషయాల్లో సమస్యలుండవు

ఈ క్రమంలో కాలేజ్ నుంచి మొదలు పెళ్లి తర్వాత కూడా నెలకు ఎంతో కొంత సేవ్ చేయాలి

కనీసం రోజుకు 100 రూపాయల నుంచి కూడా పొదుపును ప్రారంభించవచ్చు

పోస్టాఫీస్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ వంటి ఏ స్కీంలోనైనా సేవింగ్స్ చేసుకోవచ్చు

క్రమంగా పొదుపు చేయడం ద్వారా అప్పుల భారం నుంచి తప్పించుకోవచ్చు

ఈ సేవింగ్స్ మీకు భవిష్యత్తులో అత్యవసర నిధి రూపంలో సహయపడతాయి

తక్కువ వయస్సులో దీర్ఘకాల సేవింగ్స్ చేయడం ద్వారా అధిక లాభాలను పొందుతారు

ఇలా ఓ పదేళ్లు పొదుపు చేస్తే మీరు మిలియనీర్ కూడా అయ్యే ఛాన్సుంది