సెక్యూర్డ్, అన్‌సెక్యూర్డ్ లోన్స్ వీటిలో ఏది బెస్ట్
తరచుగా మనం ఏదో ఒక పని కోసం అప్పు తీసుకోవాల్సి వస్తుంది
ఈ క్రమంలో బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు రెండు రకాల రుణాలను ఇస్తాయి
వీటిలో మొదటిది సెక్యూర్డ్ లోన్ కాగా రెండోది అన్ సెక్యూర్డ్ లోన్
అయితే వీటిలో ఏది తీసుకుంటే సురక్షితం అనేది ఇక్కడ చుద్దాం
సురక్షిత రుణం అంటే మీరు ఏదైనా తనఖా పెట్టి లోన్ తీసుకుంటారు
మీరు బంగారాన్ని తనఖా పెట్టి డబ్బు తీసుకుంటారు, ఇది సెక్యూర్డ్ లోన్
మీరు రుణాన్ని తిరిగి చెల్లించనట్లైతే మీ బంగారాన్ని ఆయా సంస్థ విక్రయిస్తుంది
బంగారంతో పాటు, మీ ఇల్లు, మీ కారును కూడా తాకట్టుగా డిపాజిట్ చేసుకోవచ్చు
ఇక సురక్షిత రుణానికి వ్యతిరేకం అన్ సెక్యూర్డ్ లోన్, వీటిలో తనాఖా ఉండదు
అందుకే అసురక్షిత రుణాలపై వడ్డీ ఎక్కువగా ఉంటుంది
అసురక్షిత రుణాలు మీ క్రెడిట్ స్కోర్ ఆధారంగా మీకు అందించబడతాయి
సెక్యూర్డ్ లోన్‌లో మీరు ఎక్కువ రీపేమెంట్ సమయం పొందుతారు, వడ్డీ రేటు తక్కువ
కాబట్టి వీటిని తీసుకుంటేనే మీకు ఎక్కువ సౌకర్యాలు లభిస్తాయి
Related Web Stories
స్టూడెంట్స్ కోసం వార్షిక రుసుం లేని క్రెడిట్ కార్డ్లివే..
కియా నుంచి ఈవీ కార్ లాంచ్
దేశంలో ఇంకో 4 యాపిల్ స్టోర్స్.. ఈసారైనా హైదరాబాద్
తెలుగు రాష్ట్రంలో బంగారం ధరలు ?