మహిళ ఖాతా నుంచి  కాజేసిన సైబర్‌ నేరగాళ్లు

కొత్త అడ్రస్‌ అప్‌డేట్‌ చేస్తే పార్సిల్‌ను ఇంటికి చేర్చుతామంటూ  వాట్స్‌పలో లింక్‌ పంపారు.

 లింక్‌లో కొత్త అడ్ర్‌సతోపాటు పోస్టల్‌ చార్జీలు రూ.25  చెల్లించాలని సూచించారు. 

చెప్పిన విధంగానే లింక్‌ను ఓపెన్‌ చేసిన మహిళకు పోస్టల్‌ శాఖను  పోలిన వెబ్‌సైట్‌ తెరుచుకుంది.

నిజమేనని నమ్మిన బాధితురాలు అడ్రస్‌ అప్‌డేట్‌ చేయడంతోపాటు క్రెడిట్‌  కార్డు ద్వారా రూ. 25 చెల్లించింది.

కొద్దిసేపటికి ఆమె ఖాతా నుంచి రూ.2.43 లక్షలు వేరే ఖాతాకు బదిలీ అయినట్టు సందేశం వచ్చింది

లింక్‌ ద్వారా తెరిచిన వెబ్‌సైట్‌ చెల్లింపుల సందర్భంగా బ్యాంకు నుంచి వచ్చే ఓటీపీలను ఆటోమేటిక్‌గా తీసుకొని డబ్బు బదిలీ చేసింది.