ఫేస్‌బుక్, ఇన్‌స్టాలకు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్.. వాట్సాప్‌కు కూడా..

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను ప్రకటించారు

గతేడాది పైలట్ ప్రాజెక్టుగా పరీక్షించిన మెటా సరికొత్త ఫీచర్లు, ప్రయోజనాలతో ప్రారంభించింది

ఈ క్రమంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వెరిఫైడ్ బిజినెస్ ఆఫర్‌ను విస్తరిస్తున్నట్లు వెల్లడి

వ్యాపారాల కోసం వెరిఫై చేసిన బ్యాడ్జ్, మెరుగైన అకౌంట్ సపోర్ట్ లభిస్తుందని మేటా చెబుతోంది

ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ నెలకు ఒక యాప్‌కు రూ. 639 నుంచి మొదలవుతుండగా, గరిష్ఠంగా రూ. 21,000 వరకు ఉంటుంది

వివిధ కంపెనీల వ్యాపారావసరాల కోసం అనువైన ప్యాకేజీలు కూడా ఉన్నాయని తెలిపిన మెటా

భారతీయ యూజర్లు ఫేస్‌బుక్, ఇన్‌స్టా, వాట్సాప్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్టోర్ల నుంచి కొనే వీలుంది

ఈ క్రమంలో మరికొన్ని రోజుల్లో యూజర్లందరికీ వాట్సాప్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ వచ్చే అవకాశముందని పలువురు అంటున్నారు