ఆప్షన్స్ ట్రేడింగ్‌లో నష్టపోతున్న వారిలో తెలంగాణ టాప్

ఇటివల కాలంలో ఆప్షన్ ట్రేడింగ్ చేసి నష్టపోయిన వారి సంఖ్య భారీగా పెరిగింది

ఈ క్రమంలో సెబీ వీక్లీ ఎక్స్ పైరీ వంటి కొత్త రూల్స్ తీసుకొచ్చిన క్రమంలో కొంత తగ్గింది

కానీ గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఆప్షన్స్‌ ట్రేడింగ్‌లో వ్యక్తిగత నష్టాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది

ఆ తర్వాతి స్థానంలో ఆంధ్రపదేశ్‌ ఉన్నట్టు సెబీ ఇటీవల విడుదల చేసిన నివేదికలో వెల్లడి

ఈ క్రమంలో తెలంగాణలో స్టాక్ మార్కెట్ ట్రేడర్లు సగటున రూ.1.97 లక్షలు నష్టపోయారు

ఇదే సమయంలో ఏపీ నుంచి ఒక్కొక్కరు రూ.1.45 లక్షల నష్టాలను చవిచూశారు

ఇక రూ.1.37 లక్షల నష్టంతో తమిళనాడు మూడో స్థానంలో నిలిచింది

ఆ తర్వాత నాలుగో స్థానంలో కర్ణాటక రూ. 1.35 లక్షలతో ఉంది

అయితే దక్షిణ భారతంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల ట్రేడింగ్‌ ఎక్కువ 

ఈ క్రమంలో ఈ ట్రేడింగ్ చేసిన వారిలో వారే ఎక్కువగా నష్టపోయినట్లు సమాచారం