మహిళలు లోన్ తీసుకుని మరణించినా రూ.10 లక్షల సాయం!
తెలంగాణలో స్వయం సహాయక సంఘాల మహిళలకు గుడ్ న్యూస్ వచ్చేస్తుంది
లోన్ తీసుకొని, ఆర్థికపరమైన సమస్యల విషయంలో ఇబ్బంది పడేవారికి రేవంత్ సర్కారు శుభవార్త చెప్పింది
డ్వాక్రా గ్రూప్‌లో ఉన్న మహిళ ఏదైనా కారణంతో మరణిస్తే వారి పేరు మీద ఉన్న మొత్తం రుణం మాఫీ అవుతుంది
అంతేకాదు ఆ తర్వాత వారి కుటుంబానికి రూ. 10 లక్షల బీమా సాయం కూడా అందనుంది
అంటే ఆ మహిళ కుటుంబంపై ఎలాంటి భారం పడకుండా ఆ మొత్తం లోన్ అమౌంట్‌ను ప్రభుత్వమే చెల్లిస్తుంది
డ్వాక్రా రుణాలు, స్త్రీ నిధి ద్వారా లోన్ తీసుకున్నా ఈ బీమా వర్తించనుందని సమాచారం
లోన్ తీసుకున్న మహిళ ఏ కారణంతోనైనా చనిపోతే రూ.2 లక్షల వరకు లోన్ మాఫీ అవుతుంది
అలాగే మహిళా గ్రూప్ సభ్యురాలు చనిపోతే యాక్సిడెంటల్ బీమా కింద రూ.10 లక్షల వరకు మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం అందిస్తుంది
ఒక వేళ మహిళ గ్రూప్‌గా లోన్ తీసుకుంటే మాత్రం ఆ మొత్తం డబ్బులను ఆమె కుటుంబమే చెల్లించాల్సి ఉంటుంది
Related Web Stories
సామ్సంగ్, పేటీఎం మధ్య ఒప్పందం
కస్టమర్లు ఎప్పుడైనా పాలసీని రద్దు చేసుకోవచ్చా?
యూపీఐ స్కామ్స్ నుంచి ఇలా తప్పించుకోండి!
గ్రామాలలో ఈ స్థలం కొనొద్దా.. కొంటే ఏమవుతుంది?