రతన్ టాటా లైఫ్ సీక్రెట్స్..

రతన్ టాటా.. డిసెంబర్ 28,  1937న జన్మించారు.

రతన్ టాటా తండ్రి నావల్ టాటాను  జంషెడ్ టాటా దత్తత తీసుకున్నాడు.

కార్నెల్ యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ లో ఆర్కిటెక్చర్ డిగ్రీ,  హార్వర్డ్ యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్‌మెంట్ పట్టా అందుకున్నారు.

రతన్ టాటా జీవితంలో ప్రేమ వైఫల్యం,  పెళ్లి ప్రయత్నాలు వివిధ కారణాల వల్ల ఆగిపోవడంతో ఒంటరిగానే ఉండిపోయారు.

1961లో తొలిసారిగా టాటా స్టీల్ లో సూపర్వైజర్ గా విధులు నిర్వర్తించడంతో ఉద్యోగ ప్రయాణం మొదలైంది.

లాండ్ రోవర్,  జాగ్వార్ కార్ల తయారీ సంస్థలు,  కోరస్ స్టీల్, టెట్లీ టీ కంపెనీలు టాటా హయాంలోనే టాటా సంస్థలో విలీనమయ్యాలి.

2009లో రూ.1లక్షకే నానో కారును అందుబాటులోకి తెచ్చారు. కానీ ఇది ప్రజల్ని ఆకట్టుకోలేదు.

ఈయన శిక్షణ పొందిన ఫైలట్.  ఎఫ్-16 ఫాల్కన్ విమానం నడిపిన తొలి భారతీయుడిగా రికార్డు ఉంది.  

కుటుంబం, సంస్థల ఆదాయంలో 60శాతం పైగా విరాళాలు ఇచ్చే గొప్ప దాతృత్వం రతన్ టాటా సొంతం.

రతన్ టాటా ఎక్కువ విరాళాలు ఇవ్వడం వల్ల సంపన్నుల జాబితాలో ఆయన పేరు ఉండదు.

రతన్ టాటాకు శునకాలంటే ఎంత ప్రేమంటే.. ముంబయి లోని టాటా సన్స్ ప్రధాన కార్యాలయం "బాంబే హౌస్" ను వీధి శునకాలకు ఆశ్రమంగా మార్చారు.

రతన్ టాటా వెన్నంటి ఓ కుర్రాడు ఉంటాడు. శంతను నాయుడు అనే ఈ కుర్రాడు రతన్ టాటా సహాయకుడు,  ఆయన బాగోగులు చూసుకుంటాడు.