ఉప్పులు అనేక రకాలు.. వీటి లాభాలు తెలుసా

సాధారణంగా ఉప్పు ఎన్ని రకాలు ఉంటుందో తెలుసా

ఎవరైనా అడిగితే 2-3 రకాల ఉప్పు ఉంటుందని చెబుతుంటాం

కానీ మనం రోజూ తినే ఉప్పు 10 రకాలకుపైగా ఉంటుంది. అవేమిటో చుద్దాం

టేబుల్ సాల్ట్: దీనిని నేల కింద కనిపించే సెలైన్ మూలకాల నుంచి తయారు చేస్తారు. ఇది గాయిటర్‌కు చికిత్సగా ఉపయోగిస్తారు

సముద్రపు ఉప్పు: సముద్రపు నీటిని ఎండబెట్టి తయారు చేస్తారు. టేబుల్ సాల్ట్ కంటే పెద్ద సైజు ఉంటుంది.

పింక్ సాల్ట్ లేదా రాక్ సాల్ట్: ఈ ఉప్పు ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన ఉప్పుగా పరిగణిస్తారు

సెల్టిక్ సముద్ర ఉప్పు: ఫ్రెంచ్‌లో 'సెల్ గ్రిస్' అని కూడా పిలుస్తారు. ఫ్రాన్స్ తీరంలోని టైడల్ చెరువుల నుంచి సంగ్రహిస్తారు

నల్ల ఉప్పు: ఇది కూడా హిమాలయ ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తుంది. ఇది బొగ్గు, మూలికలు, గింజలు, బెరడుతో కూడిన కూజాలో ప్యాక్ చేస్తారు.

ఫ్లేక్ సాల్ట్: ఇది బాష్పీభవనం ద్వారా ఉప్పునీరు నుంచి సంగ్రహిస్తారు.

బ్లాక్ హవాయి ఉప్పు: దీనిని కూడా సముద్రం నుండే సంగ్రహిస్తారు. యాక్టివేట్ చేయబడిన బొగ్గు కారణంగా, ఇది ముదురు నలుపు రంగులో ఉంటుంది.

రెడ్ హవాయి ఉప్పు: ఇది శుద్ధి చేయని ఉప్పు. లేత ఎరుపు రంగులో ఉంటుంది. అగ్నిపర్వతం ఖనిజాల నుంచి వస్తుంది.

స్మోక్డ్ సాల్ట్: ఈ ఉప్పును రెండు వారాల పాటు కట్టెల మీద నిదానంగా పొగబెట్టి తయారు చేస్తారు

పిక్లింగ్ సాల్ట్: ఇది ఆహార పదార్థాలను ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు ఉపయోగిస్తారు. ఇందులో అయోడిన్ లేదా సముద్రపు ఉప్పు వంటి ఖనిజాలు ఉండవు