టాటా ట్రస్ట్స్ చైర్మన్‌గా నోయెల్ టాటా.. ఆయన గురించి ఈ విషయాలు తెలుసా?
రతన్ టాటా మృతి తర్వాత ఆయన వారసుడిగా, టాటా ట్రస్ట్స్ ఛైర్మన్‌గా నోయెల్ టాటాను నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది.
రతన్ టాటా సవతి తల్లి సిమోన్ టాటా కుమారుడే ఈ నోయెల్ టాటా. అయన 1957 లో జన్మించారు. ససెక్స్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ అందుకున్నారు.
నోయెల్ 2000 సంవత్సరంలో టాటా గ్రూప్‌లో చేరారు. టాటా గ్రూప్‌నకు చెందిన పలు కంపెనీల్లో కీలక బాధ్యతలు చేపట్టారు.
టాటా గ్రూప్‌నకు చెందిన రిటైల్ సంస్థ ``ట్రెంట్`` అభివృద్ధికి నోయెల్ ఎంతో కృష్టి చేశారు. 1998లో ఒక్క స్టోర్‌ను మాత్రమే కలిగి ఉన్న ట్రెంట్.. ప్రస్తుతం వివిధ ఫార్మాట్లలో 700కు పైగా స్టోర్లను కలిగి ఉంది.
టాటా ఇంటర్నేషనల్ లిమిటెడ్, వోల్టాస్, ట్రెంట్ చైర్మన్‌గా, టాటా స్టీల్, టైటాన్ కంపెనీ వైస్ చైర్మన్‌గా ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
నొయెల్ టాటా అలూ మిస్త్రీని వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అందరూ టాటా గ్రూప్ సంస్థల్లోనే వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు.
టాటా సన్స్‌కు ఛైర్మన్ అయ్యే అర్హత నోయెల్‌కే ఉందని గతంలో అందరూ భావించారు. అనుకోని కారణాల వల్ల నోయెల్ బావ మరిది సైరస్ మిస్త్రీని ఆ అవకాశం వరించింది.
టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్‌లో టాటా ట్రస్ట్స్‌కే 50 శాతం కంటే ఎక్కువ వాటా ఉంటుంది.
నొయెల్ టాటా.. సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌కు 11వ ఛైర్మన్‌గా, సర్ రతన్ టాటా ట్రస్ట్‌కు ఆరో ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు