మన దేశంలో టాప్-7 ధనవంతులు వీళ్లే.. 

ఫోర్బ్స్-2024 వెలువరించిన నివేదిక ప్రకారం మన దేశంలో అత్యంత ధనవంతులు, వారి ఆస్తి వివరాలు తెలుసుకుందాం.. 

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మొదటి స్థానంలో ఉన్నారు. ఆయన నెట్‌వర్త్ 119.5 బిలియన్ డాలర్లు (దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు)

రెండో స్థానంలో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ఉన్నారు. ఆయన నెట్‌వర్త్ 116 బిలియన్ డాలర్లు (దాదాపు 9.9 లక్షల కోట్ల రూపాయలు)

జిందాల్ గ్రూప్ అధినేత సావిత్రి జిందాల్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు. ఆమె నెట్‌వర్త్ 43.7 బిలియన్ డాలర్లు (దాదాపు 3.7 లక్షల కోట్ల రూపాయలు)

టెక్నాలజీ దిగ్గజం, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అధిపతి శివ నాడార్ నాలుగో స్థానంలో ఉన్నారు. ఆయన నెట్‌వర్త్ 40.2 బిలియన్ డాలర్లు (దాదాపు 3.4 లక్షల కోట్ల రూపాయలు)

సన్ ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వీ ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నారు. ఆయన నెట్‌వర్త్ 32.4 బిలియన్ డాలర్లు (దాదాపు 2.78 లక్షల కోట్ల రూపాయలు)

ప్రముఖ బిగ్ బుల్, డీమార్ట్ అధిపతి రాధాకిషన్ దమానీ ఆరో స్థానం దక్కించుకున్నారు. ఆయన నెట్‌వర్త్ 31.5 బిలియన్ డాలర్లు (దాదాపు 2.7 లక్షల కోట్ల రూపాయలు)

ఎయిర్‌టెల్ అధినేత సునీల్ మిట్టల్ ఈ జాబితాలో ఏడో స్థానంలో నిలిచారు. ఆయన నెట్‌వర్త్ 30.7 బిలియన్ డాలర్లు (దాదాపు 2.6 లక్షల కోట్ల రూపాయలు)