BSNLకు పెరుగుతున్న యూజర్లు.. 5జీ కూడా వస్తుందా

ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL దేశవ్యాప్తంగా 4G నెట్‌వర్క్ అందించేందుకు సిద్ధమైంది

ఈ క్రమంలో మరికొన్ని నెలల్లో ఈ సేవలు అంతటా అందుబాటులోకి వస్తాయి

ఈ విషయాన్ని కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి, జ్యోతిరాదిత్య సింధియా శనివారం ప్రకటించారు

ఇది అందుబాటులోకి వస్తే బీఎస్‌ఎన్ఎల్ యూజర్ల సంఖ్య భారీగా పెరుగుతుందన్నారు

ఇప్పటికే గత కొన్ని రోజులుగా BSNL కొత్త సిమ్‌లు తీసుకునే వారి సంఖ్య పెరిగిందన్నారు

ఈ క్రమంలో 4G నెట్‌వర్క్‌ను 5Gకి అప్‌గ్రేడ్ చేసే పనులు కూడా జరుగుతున్నాయని ఆయన చెప్పారు

జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ 4G నెట్‌వర్క్‌ ఉన్నప్పుడు BSNLకు ఎందుకు లేదని పలువురు ప్రశ్నించారన్నారు

ప్రభుత్వం చైనా లేదా ఇతర పరికరాలను ఉపయోగించకుండా స్వదేశీ సాంకేతికతతో 4Gని రూపొందించినట్లు చెప్పారు

ఈ క్రమంలో సొంత 4G నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడానికి ఒకటిన్నర ఏళ్లు పట్టిందన్నారు

మార్చి 2025 నాటికి లక్ష టవర్ల 4G నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు