అసలు పెన్నీ స్టాక్స్ అంటే ఏంటి.. వీటితో లాభమా, నష్టమా

పెన్నీ స్టాక్‌‌లలో పెట్టుబడులు పెడితే లక్ష కోటీ రుపాయలు అయ్యిందన్న వార్తలు వినే ఉంటారు 

కానీ ఈ స్టాక్‌‌లలో పెట్టుబడి చేసే విషయంలో చాలా జాగ్రత్త వహించాలి

ఎందుకంటే ఈ స్టాక్స్ ఎక్కువగా మార్పులకు లోనవుతాయి

దీంతోపాటు ఈ స్టాక్‌లలో లిక్విడిటీ కూడా తక్కువగా ఉంటుంది

లార్జ్ క్యాప్ కంపెనీలతో పోల్చితే ఈ స్టాక్‌ల సమాచారం ఎక్కువ లభించదు

కొన్ని సార్లు ఈ స్టాక్‌లను కొందరు వ్యక్తులు ఆపరేట్ చేస్తుంటారు

ఈ షేర్లలో భారీగా డబ్బును పెట్టి ధర పెరిగిన తర్వాత వారు అమ్మేసుకుని వెళ్లిపోతారు

ఆ క్రమంలో ఈ స్టాక్‌లలో డబ్బులు పెట్టిన మిగతా ఇన్వెస్టర్లు నష్టపోయే ఛాన్స్ ఉంది

పెన్నీ స్టాక్‌లో పెట్టుబడి పెట్టే ముందు ఆ కంపెనీ వ్యాపారం, భవిష్యత్తు గురించి అంచనా వేయాలి

ఆ కంపెనీ భవిష్యత్తుపై నమ్మకం ఉంటేనే పెట్టుబడులు చేయాలి

నేడు 4 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న బజాజ్ ఫైనాన్స్ పెన్నీ స్టాకుగానే మొదలైంది

2001లో ఈ స్టాక్ రూ.2.40 పైసలు, ప్రస్తుతం రూ.7314  రేంజులో ఉంది

తక్కువలో ఎక్కువ షేర్లు లభిస్తాయని, దాని గురించి తెలుసుకోకుండా పెట్టుబడులు చేయోద్దు