2024 సంవత్సరంలో ప్రపంచ వ్యాపార రంగంలో కొన్ని కంపెనీలు తమ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా వ్యవహారిస్తున్న ఆరు కంపెనీల గురించి తెలుసుకుందాం
యాపిల్ సంస్థ 3.441 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ కేపిటల్‌తో సాంకేతిక రంగంలో అగ్రగ్రామిగా ఉంది. దీని ఉత్పత్తుల నాణ్యత ఆధారంగా ఎక్కువమంది వినియోగదారులను కలిగిఉంది.
మైక్రోసాఫ్ట్ విలువ 3.221 ట్రిలియన్ డాలర్లు. సాంకేతిక రంగంలో ప్రముఖ సంస్థగా ఉంది. సాఫ్ట్‌వేర్, క్లౌడ్ మేనేజ్‌మెంట్ సేవల్లో అగ్రగామిగా ఉంది.
Nvidia సంస్థ విలువ 3.029 ట్రిలియన్ డాలర్లు. సెమీకండెక్టర్ల రంగంలో అగ్రగ్రామి సంస్థగా ఉంది. గ్రాఫిక్స్ ప్రాసెసింగ్, ఏఐ టెక్నాలజీకి ఈ సంస్థ ప్రసిద్ధి.
అమెజాన్ మార్కెట్ విలువ 2.020 ట్రిలియన్ డాలర్లు. ఈ కామర్స్ రంగంలో అగ్రగామి సంస్థగా ఉంది. ఆన్‌లైన్ షాపింగ్‌కు ప్రసిద్ధి చెందిన ఈ కంపెనీ కోట్లమంది వినియోగదారులను కలిగిఉంది.
గూగుల్ మార్కెట్ విలువ 1,987 ట్రిలియన్ డాలర్లు. ప్రపంచంలోనే సెర్చ్ ఇంజిన్ వెబ్‌సైట్‌లలో అగ్రగామిగా ఉంది.
ARAMCO సంస్థ మార్కెట్ విలువ 1.789 ట్రిలియన్ డాలర్లు, అరామ్‌కో ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుల్లో ఒకటిగా ఉంది.
ఈ ఆరు కంపెనీలు ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను నడిపించడంలో కీలకమైన సంస్థలుగా ఉన్నాయి.
ఈ కంపెనీల ఆవిష్కరణలు, ఉత్పత్తులు విశ్వవ్యాప్తంగా వ్యాపార భవిష్యత్తును నిర్ణయిస్తాయి.